
- బీజేపీ ఎస్సీ మోర్చా నేత కొప్పు బాషా
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ డిక్లరేషన్ ను ఎప్పుడు అమలు చేస్తారని బీజేపీ ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓట్లు, సీట్లు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని, అందులోనూ దళితులంటే మరీ చిన్నచూపు అని ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు.
నిరుడు ఆగస్టులో చేవెళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యకుడు మల్లికార్జునఖర్గే స్వయంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించారని, నేటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదన్నారు. అంబేద్కర్ అభయహస్తం పేరిట ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామన్న రూ.12 లక్షలను తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.