
సువోన్ (కొరియా): ఇండియా షట్లర్ మేఘనా రెడ్డి.. కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ తొలి రౌండ్‌లో 21 ఏళ్ల మేఘన 21–6, 21–18తో పియు చు చెన్ (చైనీస్‌తైపీ)పై, సెకండ్ రౌండ్‌లో 21–19, 22–20తో రిరినా హిరామోటో (జపాన్)పై గెలిచింది. మెయిన్ డ్రా తొలి రౌండ్‌లో మేఘన.. టోన్రగ్ సాహెంగ్ (థాయ్‌లాండ్)తో తలపడుతుంది.
మెన్స్ సింగిల్స్ క్వాలిఫయర్స్‌లో శివాన్ష్ 12–21, 21–17, 12–21తో లు వీ సువాయన్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడాడు. డబుల్స్‌లో నితిన్ కుమార్–హర్ష్ రాణా 11–21, 17–21తో బావో జిన్ డా గు లా–యు హసాంగ్ చోయు (చైనీస్‌తైపీ) చేతిలో, శివాన్ష్–ప్రణవ్ చండేల్ 15–21, 6–21తో హుంగ్ బింగ్ ఫు–ఫు సుయాన్ లియు చేతిలో ఓడిపోయారు.