పర్యావరణంపై అవగాహన : బైక్‌పై కోరుట్ల టు లఢక్‌

V6 Velugu Posted on Jul 22, 2021

పర్యావరణంపై అవగాహన కల్పించడమే లక్ష్యం
కోరుట్ల రూరల్, వెలుగు: పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఆకుల పవన్ బైక్​పై లఢక్​యాత్ర చేపట్టాడు. 6,600 కిలోమీటర్ల ప్రయాణంలో భాగంగా బుధవారం కోరుట్ల నుంచి బయలుదేరి వెళ్లాడు. పవన్​గతంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను బైక్​పై చుట్టి వచ్చాడు. తన జర్నీలో ప్రకృతి అందాలను కెమెరాలో బంధించి యూట్యూబ్​చానెల్​లో పెట్టి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నాడు.

Tagged Korutla, bike, AWARENESS, ladakh, environment,

Latest Videos

Subscribe Now

More News