అక్టోబర్ 23 నుంచి కోట మైసమ్మ తల్లి జాతర

అక్టోబర్ 23 నుంచి కోట మైసమ్మ తల్లి జాతర

కారేపల్లి, వెలుగు : నేటి నుంచి కారేపల్లి మండలంలోని ఉసిరికాయలపల్లిలో కోట మైసమ్మ జాతర మొదలవుతుంది. ఏటా విజయదశమి నాడు మొదలయ్యే జాతర ఐదు రోజులపాటు కొనసాగుతుంది. తెలంగాణతోపాటు ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభిరామారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ వేణుగోపాలచార్యులు తెలిపారు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర సందర్భంగా కోట మైసమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు జాగారం చేయడం అనవాయితీ.

జాగారం చేస్తే అమ్మవారు కోరికోర్కెలు తీరుస్తారని భక్తుల నమ్మకం. వాహన పూజల కోసమే ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాష్​శర్మ ఆధ్వర్యంలో 40 మంది పూజారులను దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. వందమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై రామారావు తెలిపారు. సీసీ కెమెరాలతోపాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్​ఏర్పాటు చేశామన్నారు.