రాజస్థాన్లోని కోటాలో గణేష్ చతుర్థి పండగకు సంబంధించిన పోస్టులను తొలగించినందుకు ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కమిటీ సోషల్ మీడియా గ్రూప్ నుంచి గణేష్ చతుర్థి పండుగ కు సంబంధించిన రెండు పోస్ట్ లను తొలగించినందుకు ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం ( సెప్టెంబర్ 7)న కోటాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మైనార్టీ వర్గానికి చెందిన ప్రిన్సిపాల్.. బ్లాక్ స్కూల్ డెవలప్ మెంట్ కమిటీకి చెందిన వాట్సాప్ గ్రూప్ లోని వినాయక చవిత కి సంబంధించిన రెండు పోస్టులను తొలగించాడు. దీంతో సహ ఉపాధ్యాయులు పాఠశాల ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు.
గంలోకి దిగిన పోలీసులు సామాజిక సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నం చేసినందుకు ప్రిన్సిపాల్ ని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఉత్తమ్ సింగ్ తెలిపారు.