29న కొత్త లోక చాప్టర్ 1 రిలీజ్..

29న కొత్త లోక చాప్టర్ 1 రిలీజ్..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా రూపొందించిన  చిత్రం ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో  లేడీ సూపర్ హీరో బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోంది.  సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. నస్లేన్ కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. 

తెలుగులో సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.  మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. భూత కాలం, ప్రస్తుత కాలాన్ని లింక్ చేస్తూ సూపర్ పవర్స్ కలిగిన చంద్ర పాత్రలో కథ సాగుతుంది. ఇందులోని యాక్షన్ సీన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది.