కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మాపై అన‌ర్హ‌త వేటు

కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మాపై అన‌ర్హ‌త వేటు

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కు షాక్ ఇచ్చింది తెలంగాణ  హైకోర్టు. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది.   2018 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని అభియోగాలున్నాయి. దీనిపై ఆయన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్  కోర్టును ఆశ్రయించారు. 

ఈ మేరకు విచారణ  చేపట్టిన ధర్మాసనం .. ఎన్నికల అఫిడవిట్ లో వనమా  తప్పుడు కేసులు, ఆస్తులంతా  అబద్దాలని తెల్చిన కోర్టు...   2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావ్  ఎమ్మెల్యే అని కోర్టు ప్రకటించింది.  తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు గాను వనమాకు రూ 5 లక్షల జరిమానా విధించింది కోర్టు. 

2018 ముందస్తు ఎన్నికల్లో  బీఆర్ఎస్  అభ్యర్థిగా జలగం వెంకట్రావ్  పోటీ చేశారు.  అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన గెలుపొందిన వనమా ఆ తరువాత కొద్దిరోజులకే  బీఆర్ఎస్ లో చేరారు. 

హైకోర్టు తీర్పుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది.