రాఘవపై భగ్గుమన్న కొత్తగూడెం.. బంద్ సంపూర్ణం

రాఘవపై భగ్గుమన్న కొత్తగూడెం.. బంద్ సంపూర్ణం
  • రాఘవ దురాగతాలకు సెల్ఫీ వీడియో పరాకాష్ట

భద్రాద్రి కొత్తగూడెం: వనమా రాఘవపై కొత్తగూడెం భగ్గుమది. రాఘవ దురాగతాలను వ్యతిరేకిస్తూ  ప్రతిపక్షాల ఆధ్వర్యంలో  తలపెట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్ పిలుపునకు స్పందించిన వ్యాపారులు, పలువురు స్వచ్చందంగా స్పందించి సంఘీభావం ప్రకటించారు. వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాల నాయకుల ఆధ్వర్యంలో రోడ్లపై ర్యాలీలు నిర్వహించి వనమా రాఘవకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
రాఘవ దురాగతాలకు సెల్ఫీ వీడియో  పరాకాష్ట అని ఈ సందర్భంగా ప్రతిపక్షాల నాయకులు పేర్కొన్నారు. రాఘవ దురాగతాలకు తండ్రి వెంకటేశ్వరరావుదే బాధ్యత అని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. దురాగతాలు కొనసాగించేందుకే అధికార పార్టీలో చేరారని వారు ఆరోపించారు. అరాచకవాదులు, మానవ మృగాలకు సమాజంలో బతికే హక్కు లేదని, ఇలాంటి వారిని ఉపేక్షిస్తే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయన్నారు. దిశ నిందితులను ఉరి తీసినట్లు రాఘవను ఉరి తీయాలె అని డిమాండ్ చేశారు. రక్షకుల్లా ఉండాల్సిన నాయకుడే భక్షకుడై మాన ప్రాణాలను బలితీసుకున్న మృగాడిని మనుషుల మధ్య నుంచి బహిష్కరించాల్సిందేనన్నారు. రాఘవ అరాచకాల గురించి ప్రతిపక్షాలు ఎంత గొంతు చించుకుంటున్నా పట్టించుకోని అధికార టీఆర్ఎస్  పార్టీ వారు సెల్ఫీ వీడియో చూసిన తర్వాత నోర్మూసుకున్నారని మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రాఘవను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

 

 

 

 

ఇవి కూడా చదవండి

ఒమిక్రాన్ పై  WHO హెచ్చరిక

నీళ్లు తాగితే దంతాలకు కూడా మంచిదే