పులి చర్మం స్మగ్లింగ్​ ముఠా అరెస్ట్

పులి చర్మం స్మగ్లింగ్​ ముఠా అరెస్ట్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పులి చర్మాలను స్మగ్లింగ్​చేస్తున్న ముఠాను కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. కొత్తగూడెం ఎఫ్ డీఓ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్​ రాష్ట్రంలోని చింతల్ నార్​అటవీ ప్రాంతంలో కొందరు ఉచ్చు వేసి ఆరు నెలల కింద మగ చిరుతపులిని బరిశెలతో చంపారు. భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన కొందరి సాయంతో పులి చర్మాన్ని బెంగళూరులో అమ్మాలని ప్లాన్​చేశారు. ప్లాన్​ప్రకారం రెండు నెలల కింద భద్రాచలం సమీపంలోని సారపాకకు తరలించి భద్రపరిచారు. శుక్రవారం సారపాక నుంచి బైక్​లపై కొందరు పులిచర్మంతో హైదరాబాద్​వెళ్లేందుకు కొత్తగూడెం వైపు వస్తున్నారని ఫారెస్ట్​ఆఫీసర్లకు పక్కా సమాచారం అందింది. ఇల్లెందు క్రాస్ రోడ్డులో నిఘా పెట్టి పట్టుకున్నారు. వారి నుంచి చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మందిని అరెస్ట్​చేసినట్లు ఎఫ్​డీఓ అపయ్య తెలిపారు. నిందితుల్లో భద్రాచలానికి చెందిన గవర్రాజు వేణు, ఏపీలోని చింతూరు, ఒంగోలుకు చెందిన కందుకూరి ఫణీంద్ర, సుద్దపల్లి శ్రీనివాస్, మడావి కోసయ్య, కె.ఎర్రయ్య, ఛత్తీస్ ఘడ్ కు చెందిన మడకం మహేశ్, మడకం జితేందర్, పూనెం సింఘా ఉన్నారు.