
హైదరాబాద్: మాస్ మహారాజా రవి తేజ కొత్త మూవీ క్రాక్ ట్రైలర్ శుక్రవారం రిలీజైంది. కొత్త ఏడాది సందర్భంగా ఈ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇంటెన్సివ్ డైలాగులతో రవితేజ ఆకట్టుకున్నాడు. పోలీస్ పాత్రలో లుక్స్, స్టయిల్‌తో మూవీపై మాస్ మహారాజా అంచనాలు పెంచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిన క్రాక్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.