హైదరాబాద్ లో నేడు (అక్టోబర్ 11) పలు ప్రాంతాల్లో నీళ్లు బంద్

హైదరాబాద్ లో నేడు (అక్టోబర్ 11) పలు ప్రాంతాల్లో నీళ్లు బంద్

హైదరాబాద్,వెలుగు : హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్ట్ ఫేజ్– 2  పరిధిలోని గున్ గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సాహెబ్ న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న 2,200 ఎంఎం డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపు లైన్​కు రాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నగూడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టేందుకు వాటర్​బోర్డు అధికారులు రిపేర్ పనులు చేపడుతున్నారు. దీంతో ఇయ్యాల ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు సిటీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

డివిజన్–1 పరిధిలోని ఎన్​​పీఏ, మీరాలం, డివిజన్–2 పరిధిలోని బాలాపూర్, మైసారం, బార్కాస్, డివిజన్–5 పరిధిలోని మేకలమండి, భోలక్ పూర్, డివిజన్–7 పరిధిలోని తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, డివిజన్–9 పరిధిలోని హస్మత్ పేట, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, డివిజన్ –10 పరిధిలోని వైశాలినగర్, బీఎన్​రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి కాలనీ, డివిజన్–13 పరిధిలోని మహీంద్రా హిల్స్, డివిజన్–14

పరిధిఎల్లుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగూడ, డివిజన్–16 పరిధి బుద్వేల్, శాస్త్రిపురం, డివిజన్–19 పరిధి బోడుప్పల్, డివిజన్–20 పరిధి మీర్ పేట, బడంగ్ పేట, శంషాబాద్, మన్నెగూడ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.