రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలి

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలి

కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా కడుతున్న రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని కృష్ణా రివర్ మేనెజ్మెంట్ బోర్డు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించింది బోర్డ్. NGT  గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పారనే విషయాన్ని ప్రస్తావించింది... కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్... నిపుణుల కమిటీ పర్యటనకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించటం లేదంది బోర్డు. రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులపై కంప్లైంట్ చేసింది. ఐతే డీపీఆర్లు సమర్పించి ఆమోదం పొందే వరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో ముందుకు వెళ్లొద్దని ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది కృష్ణా బోర్డ్.