
న్యూఢిల్లీ, వెలుగు : కృష్ణా జలాల వివాదంపై విచారణను సుప్రీంకోర్టు జనవరి 12కు వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యునల్2కు సంబంధించిన టీవోఆర్ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత నెలలో ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు నోటీసులిచ్చింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ తరఫు అడ్వకేట్ కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన బెంచ్.. విచారణను జనవరి 12కు వాయిదా వేసింది.