ఇస్కాన్​ టెంపుల్​లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

ఇస్కాన్​ టెంపుల్​లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

రాజేంద్రనగర్ సర్కిల్  అత్తాపూర్ లోని ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇస్కాన్ టెంపుల్ లో కొలువైన రాధాకృష్ణలను దర్శించుకునేందుకు  భక్తులు భారీగా  తరలివచ్చారు.  పంచామృతలతో కలశ అభిషేకాలను సైతం కన్నయ్యకు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ను ముస్తాడు చేశారు.  విద్యుత్​ దీపాలతో అలంకరించారు, కృష్ణాష్టమి సందర్భంగా అత్తాపూర్​ ఇస్కాన్​ టెంపుల్​లో జరిగిన వేడుకల్లో భక్తులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్నపిల్లలకు, వృద్ధులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని ఇస్కాన్ టెంపుల్ యాజమాన్యం చర్యలు తీసుకుంది.