డిసెంబర్ 10న ‘హలో బీసీ, చలో ఢిల్లీ’ : ఆర్.కృష్ణయ్య

డిసెంబర్ 10న ‘హలో బీసీ, చలో ఢిల్లీ’ : ఆర్.కృష్ణయ్య

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు : స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ‘హలో బీసీ, ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. డిసెంబర్ 10న ఢిల్లీలోని కాన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌లో బీసీల డిమాండ్లపై నిర్వహిస్తున్న సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొంటారని చెప్పారు. బీసీ ప్రధానిగా ఉన్న ఈ సమయంలోనే, బీసీల హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇళ్ల పట్టాలపై నిర్లక్ష్యం తగదు

కీసర: ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదని కృష్ణయ్య హెచ్చరించారు.  తెలంగాణ గుడిసె వాసుల సంఘం అధ్యక్షుడు బక్కి రవి ఆధ్వర్యంలో సోమవారం కీసర ఆర్డీవో ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003లో ఘట్ కేసర్ మండలం ప్రతాప్ సింగారం సర్వే నంబర్ 66లో 20 ఎకరాల భూమిలో అప్పటి సీఎం చంద్రబాబు ఒక్కొరికి వంద గజాల చొప్పున స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారన్నారు.

 ఈ భూమి కాలక్రమేనా 40 ఎకరాలకు తగ్గిందన్నారు. 1500 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా ఉన్నప్పటికీ కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని  ఆరోపించారు.