
వికారాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన కృష్ణవేణి గ్రూప్ –3 పరీక్ష రాయడానికి తాండూరు పట్టణంలోని సింధూ జూనియర్ కాలేజీకి వచ్చింది. కాగా ఆమెకు ఐదు నెలల బాబు ఉన్నాడు. ఎగ్జామ్ సెంటర్‌లోకి బాబుకు అనుమతి లేకపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ బాబును తీసుకుని ఆడించింది. తల్లి కృష్ణవేణి ఎగ్జామ్ రాసి వచ్చేంత వరకు బాబును జాగ్రత్తగా చూసుకుంది. దీంతో కానిస్టేబుల్ నర్సమ్మను అందరూ అభినందించారు.