బ్లూ బటర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై..నిర్మాతగా కృతి సనన్

బ్లూ బటర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై..నిర్మాతగా కృతి సనన్

కృతి సనన్.. హీరోయిన్‌‌‌‌గా కొనసాగుతూనే నిర్మాతగానూ ఎంట్రీ ఇస్తోంది. బ్లూ బటర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌‌‌‌ను అనౌన్స్ చేసింది. మొదటి ప్రాజెక్ట్‌‌‌‌గా ‘దో పట్టి’ అనే సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో ఆమె హీరోయిన్‌‌‌‌గానూ నటిస్తోంది. కాజోల్‌‌‌‌ మరో కీలకపాత్రను పోషిస్తోంది. గతంలో ‘దిల్‌‌‌‌ వాలే’లో నటించిన వీళ్లిద్దరూ ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు.

 ‘తొమిదేళ్లుగా నా కలలను సాకారం చేసుకుంటూ బేబీ స్టెప్స్ వేశాను. ఎంతో నేర్చుకున్నాను. నటిగా ఎదిగాను. ఫిల్మ్ మేకింగ్‌‌‌‌లోని ప్రతి అంశాన్ని ఇష్టపడ్డాను. ఇప్పుడు నాకు నచ్చిన మరిన్ని కథలను చెప్పడానికి మీ ముందుకొస్తున్నా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కృతి. రైటర్‌‌‌‌‌‌‌‌ కనికా ధిల్లాన్‌‌‌‌ కూడా ఈ చిత్రంతో నిర్మాతగా మారుతోంది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ కాగా నెట్‌‌‌‌ ఫ్లిక్స్‌‌ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.