
కృతి సనన్(Kriti Sanon )..తెలుగులో చాలా తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ అభిమానులను మాత్రం బాగానే సంపాదించుకుంది. తన అందం, నటనతో అందిరిని ఆకట్టుకుంది.
కృతి సనన్ తెలుగులో చివరగా ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్తో జంటగా నటించింది. నిత్యం ఫొటోషూట్లు చేసి తన అందంతో అభిమానులను ఆకట్టుకునే కృతి..తాజాగా మరో ఫొటోషూట్ చేసింది. బ్లాక్ డ్రెస్లో ఫోజులిస్తూ..కుర్రకారు మదిని కొల్లగోడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కృతి సనన్ హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. తన నటనకు గానూ..ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డ్ను, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఈమె అందుకుంది. కృతి సనన్ హిరోయిన్గా నటించిన యాన్ ఇంపాజిబుల్ లవ్స్టోరీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. షాహిద్ కపూర్ హీరోగా అమిత్ జోషి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
కృతి సనన్ తెలుగులో మహేష్ బాబు నేనొక్కడినే మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్కు కనెక్ట్ అయింది. ఆ తర్వాత నాగ చైతన్య దోచేయ్ మూవీలో నటించినప్పటికీ..అంత ఫేమ్ రాలేదు. దీంతో బాలీవుడ్కే షిఫ్ట్ అయ్యి..అక్కడ రాణిస్తుంది.