విజయ్ దేవరకొండ సరసన కృతి సనన్ ? డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!

విజయ్ దేవరకొండ సరసన కృతి సనన్ ? డైరెక్టర్ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు. పెళ్లి తర్వాత బిజీ బిజీ గడుపున్న ఆయన ప్రస్తుతం 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యూవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న'#VDx శౌర్యువ్' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటనతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస పరాజయాల తర్వాత విజయ్ కూడా ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

 విజయ్ సరసన కృతి సనన్..

ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ నటించబోతోందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.  ఇటీవలే జాతీయ అవార్డు అందుకున్న కృతి, విజయ్‌తో జతకడితే ఆ తెరపై కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించారని, కథ విన్న కృతి చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని ఇండస్ట్రీ టాక్.

హాలీవుడ్ టెక్నీషియన్ల అండ!

ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతోందని తెలుస్తోంది. దీని కోసం హాలీవుడ్ టాప్ షోలైన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ (House of the Dragon), ‘ఫాల్ అవుట్’ (Fallout), ‘స్నోపీర్సర్’ (Snowpiercer) వంటి సిరీస్‌లకు పనిచేసిన సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) యాక్షన్ సన్నివేశాలు భారతీయ వెండితెరపై సరికొత్త అనుభూతిని ఇస్తాయని టాక్.

పురాణగాథల నేపథ్యంలో 

అయితే లేటెస్ట్  సమాచారం ప్రకారం, ఈ సినిమా ఒక మైథలాజికల్ యూనివర్స్ (Mythological Universe) నేపథ్యంలో సాగే సోషియో-ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని టాక్. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి, ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని దర్శకుడు శౌర్యువ్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇప్పటివరకు రాని ఒక విభిన్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్.

ఫ్యాన్స్ ఆశలు...

వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. కృతి సనన్ వంటి గ్లామరస్ అండ్ టాలెంటెడ్ నటి తోడైతే, ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ మార్కెట్‌లోనూ భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, వెండితెరపై ఈ కొత్త జంట కెమిస్ట్రీ ఒక సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం!