
కృతి సనన్ చెల్లెలు నూపూర్ సనన్ ఇప్పటికే సింగర్‌గా గుర్తింపును తెచ్చుకుని.. ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం ఈ మూవీ నుంచి నూపూర్ సనన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అక్క కృతి సనన్ సోషల్ మీడియాలో లాంచ్ చేసింది. ఇందులో ఆమె సారా పాత్రలో కనిపించనుందని నూపూర్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు మేకర్స్.
క్యూట్ లుక్‌తో ట్రెడిషినల్ డ్రెస్‌లో ఉన్న తన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ట్రైన్ విండో సీట్లో కూర్చున్న నూపూర్ తన లవర్ అయిన టైగర్ నాగేశ్వరరావుని కలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ఫస్ట్‌లుక్‌లో కనిపిస్తోంది. ఇందులో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.