కేఆర్ఎంబీ సంగమేశ్వరం పరిశీలన వాయిదా

కేఆర్ఎంబీ సంగమేశ్వరం పరిశీలన వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు పరిశీలన  కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బృందం రేపు గురువారం తలపెట్టిన పర్యటన వాయిదా పడింది. పర్యావరణ అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం అక్రమంగా సంగమేశ్వరం వద్ద రాయలసీమ ప్రాజెక్టు చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వంతోపాటు.. పలువురు తెలంగాణ వాదులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వాస్తవాలు నిర్ధారించాల్సిందిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ బృందం గురువారం సంగమేశ్వరం ప్రాంతాన్ని పరిశీలించాలని నిర్ణయించింది. గతంలో కూడా ఒకసారి పరిశీలించాలని ప్రయత్నించగా.. ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పర్యటన వాయిదా పడింది. ఈ నేపధ్యంలో ఎన్జీటీ ఆదేశాల మేరకు గురువారం సందర్శించాలని కేఆర్ఎంబీ నిర్ణయించగా.. కేఆర్ఎంబీ బృందంలో తెలంగాణ వాది ఉన్నారంటూ.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలతోనే కేఆర్ఎంబీ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.