
హైదరాబాద్, వెలుగు : ఈ నెల17న ఉదయం 11.30 గంటలకు జలసౌధలో కేఆర్ఎంబీ త్రీమెంబర్కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు బోర్డు ఎస్ఈ ప్రకాశ్ లెటర్ రాశారు. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురే అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు పాల్గొనాలని కోరారు. యాసంగి సీజన్అవసరాలకు సంబంధించి సమర్పించిన ఇండెంట్లపై వీరు చర్చించనున్నారు. వాటర్రిలీజ్ ఆర్డర్ ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనున్నారు.