కేఆర్​ఎంబీ త్రిసభ్య కమిటీ

కేఆర్​ఎంబీ త్రిసభ్య కమిటీ
  •  మీటింగ్​ వాయిదా
  • 12న జరగనున్న సమావేశం

హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్​మేనేజ్ మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ మీటింగ్​వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం గురువారం జరగాల్సిన మీటింగ్ ను ఈ నెల 12న నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలు తాగు నీటి కోసం ఇండెంట్ పెట్టాయి. తెలంగాణ తన వాటా నీటిని వాడేసుకున్నదని ఏపీ పేచీ పెడుతున్నది. క్యారీ ఓవర్​ నీళ్లు 27 టీఎంసీలున్నాయని, అందులో నుంచి 11.79 టీఎంసీలు ఇవ్వాలని ఇప్పటికే కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసింది. 

అయితే, తెలంగాణ తన వాటా నీటిని కోటాకు మించి వాడుకున్నదని బోర్డు తెలంగాణకు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో తాగునీటి కొరత నేపథ్యంలో రెండు రాష్ట్రాలతో త్రిసభ్య కమిటీ మీటింగ్​పెట్టాలని కేఆర్​ఎంబీ నిర్ణయించినా.. వివిధ కారణాలతో మీటింగ్​కు రాలేమని రెండు రాష్ట్రాలు లేఖ రాశాయి. ఈ నేపథ్యంలోనే సమావేశాన్ని బోర్డు వాయిదా వేసింది.