
హైదరాబాద్, వెలుగు: పంపులు, వాల్వుల వంటి ప్రొడక్టులు తయారు చేసే కేఎస్బీ లిమిటెడ్ గత ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్లో రూ.52.8 కోట్ల లాభం సంపాదించింది. 2022 సంవత్సరం మూడో క్వార్టర్లో రూ.54.2 కోట్లు వచ్చాయి. అమ్మకాల విలువ రూ.524 కోట్ల నుంచి రూ.602 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ.447 కోట్ల నుంచి రూ.521 కోట్లకు పెరిగాయి.
ఇతర ఆదాయాలు రూ.8.7 కోట్ల నుంచి రూ.6.5 కోట్లకు తగ్గాయి. 2023 సంవత్సరంలో రూ.2,247 కోట్ల విలువైన అమ్మకాలు సాధించామని కంపెనీ తెలిపింది. వార్షికంగా వీటి విలువ 23.3 శాతం పెరిగింది.