రజినీ కాంత్ పొగిడినా.. ఇక్కడున్నోళ్లు కళ్లు తెరుస్తలేరు: కేటీఆర్

రజినీ కాంత్  పొగిడినా.. ఇక్కడున్నోళ్లు కళ్లు తెరుస్తలేరు: కేటీఆర్

తెలంగాణ వచ్చాక కొత్తగా 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు కేటీఆర్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన కేటీఆర్ 2022-23 లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయన్నారు.  ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని చెప్పారు.  దేశం  మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్ లో 44 శాతం తెలంగాణవేనన్నారు. 1987లో మొట్టమొదట ఐటీ టవర్ వచ్చిందన్నారు.  తెలంగాణ వచ్చే సరికి  ఐటీ ఎగుమతులు రూ.,56 వేల కోట్లని.. ఒక్క గతేడాదిలోనే  ఐటీ ఎగుమతులు 57 వేల కోట్లని చెప్పారు. 

హైదరాబాద్ లో  ఎకరం వందకోట్లు పలుకుతుందంటే హైదరాబాద్ అభివృద్ధి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. రజనీకాంత్ లాంటి వ్యక్తి పొగిడినా ఇక్కడున్న కొంతమంది కళ్లు తెరవడం లేదన్నారు.  హైదరాబాద్  అద్భుతమైన ప్రగతి సాధిస్తుందన్నారు.  ఐటీ అభివృద్ధిలో  బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ నంబర్ వన్ గా ఉందన్నారు. ఐటీ అభివృద్ధిని ప్రతిపక్షాలు మెచ్చుకోవాలని సూచించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తున్నామన్నారు.