జాగ్రత్తగా ఉండాలి.. జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్పై ఏజెంట్లకు కేటీఆర్, హరీశ్ రావు సూచన

జాగ్రత్తగా ఉండాలి..  జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్పై  ఏజెంట్లకు కేటీఆర్, హరీశ్ రావు సూచన

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్​ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్​ కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ నేతలు​ కేటీఆర్,​హరీశ్ రావు సూచించారు. కౌంటింగ్ ​ప్రక్రియపై గురువారం తెలంగాణ భవన్​లో కౌంటింగ్​ ఏజెంట్లు, కేడర్​తో వారు సమావేశం నిర్వహించారు. కౌంటింగ్​ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అనుమానం ఉన్నట్టు అనిపిస్తే ఒకటికి రెండు సార్లు మళ్లీ ఓట్లు లెక్కించేలా కౌంటింగ్​ అధికారులకు ఏజెంట్లు విజ్ఞప్తి చేయాలని సూచించినట్టు తెలిసింది. 

పోలింగ్​ సమయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం, ఆ పార్టీ అన్ని రకాల అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్, హరీశ్​ రావు ఆరోపించారు. ఎన్నికల కోసం ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. కౌంటింగ్​లోనూ కాంగ్రెస్​ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏజెంట్లకు సూచించారు.