తమ్ముడు ఇంతపని చేస్తావనుకోలేదు..అభిమానిపై కేటీఆర్ సీరియస్

తమ్ముడు ఇంతపని చేస్తావనుకోలేదు..అభిమానిపై కేటీఆర్ సీరియస్

హైదరాబాద్, వెలుగు: తన ఫొటోను వీపు పై పచ్చ బొట్టు పొడిపించుకున్న టీఆర్ ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్త బి. రవికిరణ్ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వీపుపై కేటీఆర్ ఫొటో, దానికి పైన ‘‘యంగ్ డైనమిక్ లీడర్” అని, ఫొటో కింద ‘‘జై రామ్ అన్న” అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉన్న ఫొటోను రవికిరణ్ ట్విటర్ లో షేర్ చేశాడు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘ఇది నిజమేనా..? సారి తమ్ముడూ  ఇలాంటి వాటిని అంగీకరించను, సపోర్ట్ చేయను. ఇది ఆరోగ్యానికి హానికరం. బాధపెట్టే విషయం..’’ అని చేతులు జోడించిన ఎమోజీతో కలిపి  కేటీఆర్ ట్వీట్ చేశారు.