కేంద్రానిది అంతులేని వైఫల్యాల చరిత్ర 

కేంద్రానిది అంతులేని వైఫల్యాల చరిత్ర 

కేంద్రానిది అంతులేని వైఫల్యాల చరిత్ర అని మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. నరేంద్రమోడీ రైతు విరోధి అన్న కేటీఆర్.. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని కష్టాలు డబుల్ చేసిండని విమర్శించారు. మోడీ హయాంలో మహిళలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కైందన్న ఆయన.. ఆత్మ నిర్భర్ భారత్ పేరు చెప్పి మనోనిబ్బరం కోల్పోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. మనం చెల్లించే పన్నుల ద్వారా వసూలైన సొమ్మును కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.  

ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తే సీఎం కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీ కూడా క్రియేట్ చేసిండని కేటీఆర్ అన్నారు. దేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాల్లో మనది నాలుగవదని చెప్పారు. మన పథకాలైన రైతు బంధు, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్లను కేంద్రం కాపీ కొడుతోందన్న కేటీఆర్.. వీటిని బట్టి చూస్తే దేశానికి తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని అభిప్రాయపడ్డారు. అందుకే దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. 

కాలంతో పోటీపడుతూ కాళేశ్వరాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్ సొంతమని కేటీఆర్ చెప్పారు. పాలమూరులో రివర్స్ మైగ్రేషన్, రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటికీ జీవకళ, 4ఏళ్లలో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించిన ఘటన ముఖ్యమంత్రిదని అన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయ దిగుబడి, ఐటీ దిగుమతులు భారీగా పెరిగాయన్న కేటీఆర్.. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం 130శాతం పెరిగిందని వెల్లడించారు. 

మరిన్ని వార్తల కోసం..

కోవిడ్ ముప్పు ఇంకా పోలె

నేనడిగే 21 ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి