హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి తానే ప్రధాన కారణమని ఆమె చేసిన వ్యాఖ్యలపై గురువారం నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ తరఫు అడ్వకేట్ వీడియోలు సహా 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు. సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ ను పేర్కొన్నారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఈ నెల14కు వాయిదా వేసింది.
