రాజన్నసిరిసిల్ల, వెలుగు: దేవాదాయ శాఖ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ట్రోలింగ్‌ను ఖండిస్తూ సిరిసిల్లలో బీసీ రాజ్యాధికార సమితి ప్రతినిధులు మంగళవారం ఆందోళన చేపట్టారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ మహిళా మంత్రి పట్ల అనుచితంగా,అమర్యాదగా ట్రోల్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చేనేత మహిళా కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్‌కు ఆ వర్గం మహిళల పట్ల గౌరవం లేదన్నారు. కేటీఆర్.. సురేఖకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.