
- సిగాచి ఘటనపై కేటీఆర్ ఫేక్ ప్రచారం
- మృతదేహాలను అట్టపెట్టెల్లో పెట్టి ఇస్తున్నారంటూ ట్వీట్
హైదరాబాద్, వెలుగు: సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. చనిపోయిన కార్మికుల మృతదేహాలను అట్టపెట్టెల్లో పెట్టి తరలిస్తున్నారంటూ విమర్శలు చేశారు.
కార్మికుల మృతదేహాల గుర్తింపు కోసం శాంపిళ్లను పటాన్చెరు ఏరియా ఆసుపత్రి వద్ద స్ట్రెచర్లపై ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలిస్తున్న వీడియోను ఓ జర్నలిస్టు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మృతదేహాలను కాటన్బాక్సుల్లో పెట్టి తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
కార్మికుల డెడ్‌బాడీలను ప్రభుత్వం అట్టపెట్టెల్లో పెట్టి బంధువులకు అప్పగిస్తున్నదని ఆరోపించారు. పరాయి రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు చనిపోతే వారి మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు. వలస కార్మికులు మనుషులు కారా? అని అడిగారు. తీరా అవి డీఎన్ఏ పరీక్షల కోసం సేకరించిన మృతదేహాల శాంపిల్స్అని, మృతదేహాలు కావని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేయడంతో మాజీ మంత్రి తీరుపై విమర్శలు వస్తున్నాయి.