
ప్రాంతీయ పార్టీలే ఢిల్లీ రాజకీయాలను శాసించబోతున్నాయని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అభివృద్ధిలో వెనకబడిందన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే మనం నిర్ణయించిన వారే ప్రధాని అవుతారన్నారు. తెలంగాణ భవన్ లో పరిగి, తాండూరు, జహీరాబాద్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. వలస నేతలను పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ కాబోతుందన్నారు.