మాజీ సైనికుడి బిడ్డకు కేటీఆర్‌‌ సాయం

మాజీ సైనికుడి బిడ్డకు కేటీఆర్‌‌ సాయం

హైదరాబాద్‌‌, వెలుగు: మాజీ సైనికుడి కుమా ర్తె కలసాకారానికి టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ చేయూతనిచ్చారు. వీరభద్రాచారి  కుమార్తె మహాలక్ష్మి తెలంగాణ ఏవియేషన్‌‌ అకాడమీలో పైలట్‌‌ ట్రైనింగ్‌‌ తీసుకుంటోంది. తన కూతురకు సాయం అందించాలని వీరభద్రాచారి ఈనెల 10న కేటీఆర్‌‌ను ట్విట్టర్‌‌ ద్వారా కోరారు. స్పందించిన కేటీఆర్‌‌.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె ట్రైనింగ్‌‌ ఫీజు మొత్తాన్ని గురువారం తెలంగాణ భవన్‌‌ లో చెక్కు రూపంలో అందజేశారు.