KTRతో లంచ్ మీటింగ్ లో పాల్గొన్న MLAలు వీరే

KTRతో లంచ్ మీటింగ్ లో పాల్గొన్న MLAలు వీరే

TRSలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసేందుకు అవసరమైన రాజకీయ ప్రక్రియ క్లైమాక్స్ కు చేరింది. వ్యూహాన్ని టీఆర్ఎస్ సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటినుంచీ.. ఇప్పటివరకు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించిన ఎమ్మెల్యేలు, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను కలిసి తమ నిర్ణయాన్ని చెప్పిన ఎమ్మెల్యేలు, తాజాగా TRSలో చేరుతున్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొత్తం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. వారితో లంచ్ మీటింగ్ ఏర్పాటుచేశారు కేటీఆర్. విలీన ప్రతిపాదన పత్రంపై 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి స్పీకర్ కు అందజేస్తారు.

కేటీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు వీరే.

  1. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి – ఎల్బీనగర్
  2. పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి – మహేశ్వరం
  3. బీరం హర్షవర్ధన్ రెడ్డి – కొల్లాపూర్
  4. ఆత్రం సక్కు – ఆసిఫాబాద్
  5. రేగా కాంతారావు – పినపాక
  6. హరిప్రియ బానోత్- యెల్లందు
  7. వనమా వేంకటేశ్వరరావు – కొత్తగూడెం
  8. కందాల ఉపేందర్ రెడ్డి – పాలేరు
  9. గండ్ర వెంకట రమణారెడ్డి – భూపాలపల్లి
  10. చిరుమర్తి లింగయ్య- నకిరేకల్
  11. జాజాల సురేందర్ – యెల్లారెడ్డి
  12. పైలట్ రోహిత్ రెడ్డి – తాండూర్

మరికొందరు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా కేటీఆర్ విందు భేటీలో పాల్గొంటున్నారు.