రాజన్న సిరిసిల్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. పట్టణంలో పద్మనాయక వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు ఇటీవల భుజం సర్జరీ జరగగా ఎల్లారెడ్డిపేటకు వెళ్లి ఆయనను పరామర్శించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, సర్పంచ్ అభ్యర్థులను కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. అక్కడినుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, నాయకులున్నారు.
