తెలంగాణపై అహంకారం కాదు.. చచ్చేంత మమకారం ఉంది: కేటీఆర్

తెలంగాణపై అహంకారం కాదు.. చచ్చేంత మమకారం ఉంది: కేటీఆర్

తెలంగాణపై అహంకారం కాదు.. చచ్చేంత మమకారం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు సంబంధం లేని అంశాలపై విపక్షాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

ధాన్యం ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో క్రెడాయ్ ఆధ్యర్యంలో స్థిరాస్తి శిఖారాగ్ర సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ వచ్చి తొమ్మదిన్నరేళ్లు అయిందని.. ఇన్ని సంవత్సరాలలో కొవిడ్, ఎన్నికల వల్ల ఆరున్నరేళ్లు మాత్రమే నికరంగా పరిపాలిచామన్నారు.

ఇన్ని ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి మీ ముందు ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటికి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 14వ స్థానంలో ఉండేదని.. ప్రస్తుతం పంజాబ్ ను వెనక్కి నెట్టి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని కేటీఆర్ తెలిపారు.