
ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్ పెంచుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. జహీరాబాద్ లోని మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ఎలక్రిక్ వెహికల్ తయారీ యూనిట్ కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్లు తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి జహీరాబాద్ లో 1000 కోట్ల పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందన్నారు.
టీఎస్ఐపాస్ తో 21 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో 23 వేల పరిశ్రమలు, 3 లక్షల 30 వేలపెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు కేటీఆర్.
భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని.. తెలంగాణ ఆర్టీసీలో, తెలంగాణ ప్రైవేట్ వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు కేటీఆర్. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ అడ్డాగా మారాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చే కంపెనీలలో స్థానిక యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు. జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం స్కిల్ డెవ్ లప్ మెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.