
ఇవాళ వనపర్తి, చేవెళ్లలో టీఆర్ఎస్ సన్నాహక సభలు జరుగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు TRS పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు నాగర్ కర్నూల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ఇవాళ (శనివారం) నేడు నిర్వహిస్తున్నారు. ఉదయం వనపర్తి జిల్లా నాగవరం శివారులో నిర్వహించే నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సభకు, మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో జరిగే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరు కానున్నారు.