ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో పనేంటి: కేటీఆర్

ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో పనేంటి: కేటీఆర్

హైదరాబాద్ : ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని సీరియస్ అయ్యారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్.  ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందని.. ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు విచారణ చేపడితే తప్పేంటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇదే విషయంపై ఇవాళ తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

లోకేష్వర్ రెడ్డిపై దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. ఐటీ గ్రిడ్ తప్పుచేయకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి భయమెందుకు అన్న కేటీఆర్..  తెలంగాణ ప్రభుత్వాన్ని  విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. అడ్డంగా దొరికిపోవడం చంద్రబాబు, లోకేష్ కు అలవాటేనని… చంద్రబాబు చిల్లర ప్రభుత్వాలు మానుకోవాలన్నారు కేటీఆర్.