
హైదరాబాద్, వెలుగు: ‘‘పార్టీలో ఎవరు పనిచేస్తున్నారో? ఎవరు పనిచేయడం లేదో? పూర్తి రిపోర్ట్ ఉంది. అసంతృప్తి వ్యక్తం చేసినంత మాత్రాన పదవి వస్తదా? ఎప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలో సీఎంకు తెలుసు. పార్టీలో డిసిప్లేన్ చాలా ముఖ్యం. క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తప్పవు”అని పార్టీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వంపై జనరల్ సెక్రెటరీలు, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పదవులు రాలేదని అసంతృప్తి గళం విప్పడంపై ఈ సమావేశంలో కేటీఆర్ పరోక్షంగా ప్రస్తావించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశం వివరాలు మీడియాకు చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. బయటికి వెళ్లాక ఎవరైనా మీడియాతో మాట్లాడితే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై టైమ్ వచ్చినప్పుడు నిర్ణయాలు ఉంటాయని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
సభ్యత్వ పుస్తకాలు ఎప్పుడిస్తరు
సభ్యత్వ పుస్తకాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదని పార్టీ నాయకులను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎంత కాలం ఉంచుకుంటారని, అసలు సభ్యత్వాలు చేశారా? లేదా? అని వాళ్లను అడిగారని తెలిసింది. ఈ నెల 15వ తేదీ లోపు సభ్యత్వ పుస్తకాలు ఇవ్వాలని, బూత్ కమిటీల లిస్టును తెలంగాణ భవన్ కు అందచేయాలని ఆదేశించినట్టు సమాచారం.
సమన్వయంతో పనిచేయండి
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం టీఆర్ఎస్ దేనని అన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు అంతా పనిచేయాలని ఆదేశించారు. మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, రాజయ్య, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి నాయినితో కేటీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు.
తెలంగాణ భవన్ లో సందడి
రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్.. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేటీఆర్ రాకతో తెలంగాణ భవన్లో సందడి నెలకొంది. తమ ప్రియతమ నేతకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన్ను కలిసేందుకు పోటీ పడ్డారు.
కొత్త మున్సిపల్ చట్టంలో ఎన్నో సౌలత్ లు
మున్సిపల్ చట్టం గురించి ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏ అండ్ యూడీ),
పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు కొత్త చట్టంలో ఎన్నో సౌకర్యాలున్నాయని, వాటిని తెలియజెప్పాలని సూచించారు. బుధవారం నగరంలోని ఎంఏఅండ్ యూడీ శాఖ హెడ్ క్వార్టర్స్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని
అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపాలిటీలు, జీహెచ్ ఎంసీ జలమండలి, హైదరాబా
ద్ మెట్రో రైల్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో కొనసాగుతున్న పనులు, వివిధ ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు పురోగతిలో ఉన్న అన్ని పనులను కొనసాగించడంతో పాటు మున్సిపల్ చట్టం ద్వా రా తెచ్చిన సంస్కరణలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో ఎల్‌ఈడీ లైట్లు , పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, లేఔట్లలో ఖాళీ స్థలాలు రక్షించడంతో పాటు వాటి వినియోగం, ఓపెన్ ఎయిర్ జిమ్‌ల ఏర్పా టు, శ్మశాన వాటికల అభివృద్ధి తదితర కార్యక్రమాలను మున్సిపల్ అడ్మినిస్ట్రే షన్ డైరెక్టర్ శ్రీదేవి వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్ ఎండీఏ ప్రణాళికలను వివరించారు. సమావేశంలో జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ
ఎన్వీ ఎస్ రెడ్డి , ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.