గొప్ప ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నం : కేటీఆర్

గొప్ప ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నం : కేటీఆర్
  •     పార్టీకి అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు గొప్ప ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన నిబద్ధతతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెంట నడిచి, ఎన్నికల్లో ప్రజామోదం కోసం బీఆర్‌‌‌‌ఎస్‌‌ శ్రేణులు కొట్లాడిన తీరు బాగుంది. 

ఐదు నెలలుగా సామాజిక మాధ్యమాల్లో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు”అని ట్వీట్‌‌లో పేర్కొన్నారు. ఇతర పార్టీలు ఇచ్చినట్టుగా, తమ పార్టీ సోషల్ మీడియా వారియర్లకు డబ్బులివ్వడం లేదని, వాళ్లే వాలంటీర్‌‌‌‌గా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ మీదున్న విశ్వాసంతోనే తమ పార్టీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో తమ వాణిని బలంగా వినిపించి అద్భుతంగా కొట్లాడారని పేర్కొన్నారు. అంతకుముందు నందినగర్ జీహెచ్​ఎంసీ కమ్యూనిటీ హాల్​లో బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ దంపతులు ఓటేశారు.