Nagabandham: విష్ణు దేవాలయాల బ్యాక్‌డ్రాప్‌లో ‘నాగబంధం’.. టీజర్ డేట్ లాక్

Nagabandham: విష్ణు దేవాలయాల బ్యాక్‌డ్రాప్‌లో ‘నాగబంధం’.. టీజర్ డేట్ లాక్

‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్, ఎన్‌‌‌‌‌‌‌‌ఐకే  స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు  ప్రమోషనల్ పోస్టర్లతో సినిమాపై బజ్‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేశారు మేకర్స్.

తాజాగా టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను అందించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 15న టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. ఈ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  పురాతన ఆలయంలోని రహస్య నిధికి  రక్షణగా  ఉన్న  నాగుపాము కనిపిస్తోంది. ఇది సినిమాలోని ఆధ్యాత్మిక దైవిక రహస్యాన్ని సూచిస్తోంది. భారతదేశంలోని చారిత్రాత్మక విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగే ఈ కథాంశం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ ఇవ్వనుందని దర్శక నిర్మాతలు చెప్పారు.

నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అభే, జునైద్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  తెలుగుతోపాటు  తమిళ, కన్నడ, మలయాళ, హిందీ  భాషల్లో రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు.