కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా?

కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా?

రాజన్న సిరిసిల్లా: కేసీఆర్ లేకపోతే ఈ జన్మలో తెలంగాన వచ్చేది కాదని మత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం బండ లింగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ప్రైమరీ స్కూల్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని, ఇవాళ తెలంగాణలో అమలవుతున్న ఏ పథకం ఉండేది కాదన్నారు. నీళ్లు, కరెంట్, రైతులకు పెట్టుబడి సాయం, ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల సాయం, ఆసరా పెన్షన్లు, విదేశీ విద్యానిధి, గురుకుల పాఠశాలల్లో పురోగతి, రైతు వేదికలు, స్మశాన వాటికలు, డంపు యార్డ్స్ వంటివి ఏవీ ఉండేవి కావని తెలిపారు. కుల, మతాల పేరుతో కొంత మంది ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దమ్ముంటే  కనీసం ఓ వెయ్యి కోట్లు నిధులను రాష్ట్రం కోసం తీసుకురావాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. రూ.7300 కోట్లతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తమపై రాళ్లు వేసేందుకు ప్రతి పక్షాలు ప్రయత్నిస్తున్నాయని... అయితే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

రాహుల్ ఎందుకొస్తున్నారో చెప్పాలె

RCBతో మ్యాచ్: టాస్ గెలిచిన చెన్నై