హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతల్లో పదవికి ఉండాల్సిన హుందాతనం, గౌరవం కరువయ్యాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. గాంధీలకు బాడీగార్డులా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ బైక్ వెంట మంత్రులు, పీసీసీ చీఫ్ పనివాళ్లలా పరుగులు తీయడం అవమానకరమన్నారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్షా కాళ్లు మొక్కుతూ చెప్పులు మోస్తున్నారని విమర్శించారు.
ప్రజలు ఇచ్చిన పదవుల గౌరవాన్ని దిగజార్చేలా కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రవర్తన ఉందని, ఇది అత్యంత సిగ్గుచేటు..అవమానకరమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జాతీయ పార్టీల నేతల వ్యవహారశైలి ఉందని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావమే ఆత్మగౌరవ పునాదులపై జరిగిందని, ఈ రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదన్నారు
