హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసులో విషయం లేదని, ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘ఈ కేసులో సీఎం రేవంత్‌కు నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
ఎఫ్ఐఆర్కు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత మళ్లీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు.ప్రభుత్వం నుంచి పోతే గవర్నర్ న్యాయ సలహా తీసుకున్నారని, అందుకే టైమ్ పట్టిందని తెలిపారు. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు. లై డిటెక్టర్ పరీక్షకూ సిద్ధంగా ఉన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేందుకు ఫార్ములా ఈ రేస్ అంశాన్ని రేవంత్ రాజకీయం చేశారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో దానంతో రాజీనామా చేయిస్తానని చెప్పారు. అనర్హత వేటుపడితే పరువు పోతుందన్న ఉద్దేశంతో రిజైన్‌కు అవకాశం ఇస్తున్నారు. సాంకేతికపరమైన సాకులు చూపుతూ కడియం శ్రీహరిని కాపాడే అవకాశం ఏమైనా ఉందేమోనని చూస్తున్నరు. ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలే వస్తాయి. ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
