
తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ వేశారు కేటీఆర్. జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు కేటీఆర్. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరిన రోజు అని కేటీఆర్ అన్నారు. స్వపరిపాలనలో బంగారు తెలంగాణకు పునాది పడిన రోజుగా పేర్కొన్నారు.