జైపూర్‌‌‌‌ మండలంలో టాటా ఏస్‌‌‌‌ బోల్తా.. ఆరుగురు స్టూడెంట్లకు గాయాలు

జైపూర్‌‌‌‌ మండలంలో టాటా ఏస్‌‌‌‌ బోల్తా.. ఆరుగురు స్టూడెంట్లకు గాయాలు
  • మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌ మండలంలో ఘటన

జైపూర్, వెలుగు : స్కూల్‌‌‌‌ పిల్లలతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌ మండలంలోని నర్వ గ్రామ శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ తన టాటా ఏస్‌‌‌‌ వెహికల్‌‌‌‌లో 23 మంది స్టూడెంట్స్‌‌‌‌ను శ్రీరాంపూర్‌‌‌‌లోని ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌కు తీసుకెళ్తుంటాడు. 

శుక్రవారం ఉదయం రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ 8 మంది స్టూడెంట్లను ఎక్కించుకొని స్కూల్‌‌‌‌కు వెళ్తున్నాడు. గ్రామ శివారులోకి రాగానే టాటా ఎస్‌‌‌‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పల్టీ కొట్టింది. ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురు స్టూడెంట్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని మంచిర్యాలలోని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు జైపూర్‌‌‌‌ పోలీసులు తెలిపారు.