
- 14 నెలల చిన్నారి మృతి, తండ్రి పరిస్థితి విషమం
- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన
బెల్లంపల్లి, వెలుగు : ఇంట్లో పడుకున్న తండ్రీకొడుకులను పాము కాటేయడంతో 14 నెలల చిన్నారి చనిపోగా.. తండ్రి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బెల్లంపల్లి బస్తీకి చెందిన జంగపల్లి ప్రవీణ్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి తన కుమారుడు వేదాన్ష్ (14 నెలలు)తో కలిసి ఇంట్లో పడుకున్నాడు.
తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన పాము వేదాన్ష్‌తో పాటు ప్రవీణ్‌ను కాటేసింది. మెలకువ వచ్చిన ప్రవీణ్ పాము కాటేసిన విషయాన్ని గమనించి కుటుంబసభ్యులకు చెప్పగా... ఇద్దరినీ బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం మంచిర్యాల జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. వేదాన్స్ పరిస్థితి విషమించడంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ప్రవీణ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకుకేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.