మేఘా​పై‌‌ చర్యలేవి? రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్

మేఘా​పై‌‌ చర్యలేవి? రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, వెలుగు: సుంకిశాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌  రిటైనింగ్ వాల్  కూలిన ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 10 రోజులైందన్నారు. 

దీనికి కాంట్రాక్టు సంస్థ కారణమైతే, ఆ సంస్థను(మేఘా) బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ లో పెట్టి ప్రమాదంపై జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.  తెలంగాణలో ఉన్న మీ ప్రభుత్వం ఏజెన్సీ పట్ల ఎందుకంతా మెతక వైఖరితో వ్యవహరిస్తోందో చెప్పాలని రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.