సిటీలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు.!

సిటీలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు.!

హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది రాష్ట్ర సర్కారు. ట్విట్టర్ లో నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇంట్రస్టింగ్ రిప్లై ఇచ్చారు మంత్రి కేటీఆర్.  మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అవకాశాలేమైనా ఉంటే పరిశీలించాలంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ను కేటీఆర్ కోరారు.

జూపార్క్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్తున్న 7z డబుల్ డెక్కర్ బస్సు ఫొటోను ట్విట్టర్ లో కేటీఆర్ కు ట్యాగ్ చేశారు నెటిజన్ షకీర్ హుస్సేన్. జూపార్క్, అఫ్జల్ గంజ్, హైకోర్టుల మీదుగా… ఎన్నో చారిత్రక ప్రాంతాల మీదుగా ఈ బస్సు వెళ్తుందని.. దీనిని టూరిస్టు సిటీ గైడ్ బస్సుగా గానీ.. పబ్లిక్ బస్సుగా గానీ ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పారు. స్పందించిన కేటీఆర్… తాను అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కు డబుల్ డెక్కర్ బస్సులోనే వెళ్లానని గుర్తు చేశారు. డబుల్ బస్సులను ఎందుకు రద్దు చేశారో తెలియదని అవకాశముంటే పరిశీలించాలని మంత్రి పువ్వాడను కోరారు కేటీఆర్.